జీహెచ్‌ఎంసీ మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది: టి.పి.సి.సి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని టి.పి.సి.సి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్నాక డివిజన్143 అభ్యర్ధిని, శ్రీమతి జీడి అనిత అమర్ నాథ్ గారి ప్రచారంలో భాగంగా ఆయన పాల్గొని వ్యాఖ్యానించారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలు చాలా భిన్నంగా ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో గత ఎన్నికల్లో అవలీలగా గెలుచిన టీఆరెస్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలవడం కష్టమని ఆయన అన్నారు. టీఆరెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని, వారి కుటుంబ పాలనకు తగిన బుద్ధి ఈ ఎన్నికల్లో స్పష్టంగా అందరికి కనిపిస్తుంది అని ఉత్తమ్ పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో టీఆరెస్ ప్రభుత్వం ఏదో చేస్తది అనుకోని ప్రజలు మోసపోయారు కానీ ఇప్పుడు అలాంటి తప్పు మళ్ళీ పునరావృతం కాదు అని నేను భావిస్తున్నాను. టీఆరెస్ ప్రభుత్వం హయాంలో ఇప్పటి వరకు ఎంత మేరకు అభివృద్ధి జరిగింది అని హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. నేను హైద్రాబాధినే ఈ నగరాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదు. చిన్నపాటి వర్షాలకే నగరం చెరువులను తలపిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ గారు శాసనసభలో మాట్లాడుతూ అరవై వేల కోట్లు కార్చుపెట్టినం అని అన్నారు అన్ని వేల కోట్లు ఎక్కడ కార్చుపెట్టారో తెలియని పరిస్థితి. ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్నికి ఇప్పటి వరకు ఎం చేసింది అంటే చెప్పడానికి ఏమీలేదు శూన్యం. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది ఉదయారణకు శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, గోదావరి జలాలు,పివి ఎక్స్ప్రెస్ హైవే, lnt మెట్రో, కృష్ణ నది జలాలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరిగాయి అని చెప్పడం నిస్సందేహం. కరోనా విపత్తులో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే కేసీఆర్ గారు ఫార్మహౌస్ కె అంకితం అయిపోయి ప్రజలను గాలికి వదిలేశారు. ఇవ్వని ప్రజలు గమనిస్తున్నారు టీఆరెస్ కు బీజేపీ కి గట్టి బుద్ది చెప్పబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితం వస్తుందని మాకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన అన్నారు. తార్నాక డివిజన్ 143 అభ్యర్థిని శ్రీమతి జీడి అనిత అమర్ నాథ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరికి ఆపద వచ్చిన వెంటనే స్పందించే నాయకుడు అమర్ నాథ్ గారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published.