గుడిమల్కాపూర్ లో దూసుకపోతున్న వేణుగౌడ్ :

గుడిమల్కాపూర్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హోరహోరిగా ప్రచారం ఊపందుకున్న తరుణంలో ముఖ్యంగా గుడిమల్కాపూర్ డివిజన్ లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య వేడి వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వేణుగౌడ్ స్థానికుడి , పట్ట భద్రుడు కావడంతో స్థానిక యువత వేణుగౌడ్ అడుగు జాడల్లో నడిచేందుకు సిద్దమయ్యారు. ఆదివారం గుడిమల్కాపూర్ డివిజన్ లో ఆయా పార్టీలు తీసిన ర్యాలీలలో కాంగ్రెస్ అభ్యర్థి వేణుగౌడ్ ర్యాలీలో యువత, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారంలో పాల్గొనగా టీఆర్ఎస్, బీజేపీ నాయకులు తీసిన ర్యాలీలు నిరాశ పర్చాయి. వేణుగౌడ్ ముందు నుంచి స్థానిక సమస్యల ప్రశ్నించే అలవాటు కలిగి ఉండడం, దేవాలయ భూములు కబ్జా అవుతున్న తరుణంలో ముందుండి పోరాడంతో వేణుగౌడ్ కు స్థానికంగా ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే వేణుగౌడ్ పెద్ద ఎత్తున ప్రజాధారణ పొంది ప్రజల్లో ఒకడిగా నిలుస్తున్న తరుణంలో గుడిమల్కాపూర్ ఎన్నిక బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు అతడే ప్రధాన పోటీగా పావులు కదుపుతున్నారు. చూడాలి ఈ పోరులో వేణుగౌడ్ కు దీటుగా ఏ పార్టీ నిలుస్తోందో….?

Leave a Reply

Your email address will not be published.