ఈటల సంచలన వ్యాఖ్యలు.. కెసిఆర్ తర్వాత ఆయనే సీఎం..

ఈటల సంచలన వ్యాఖ్యలు.. కెసిఆర్ తర్వాత ఆయనే సీఎం..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఈటల రాజేందర్ పై చేసిన భూకబ్జా ఆరోపణలు అయన విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం మీడియా సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కీలక అంశాలను వెల్లడించారు. ప్రస్తుత తెలంగాణ సీఎం కెసిఆర్ పదవి అయన అనంతరం వారి కుమారుడు కేటీఆర్ కావాలని ఇప్పటికే పలు సందర్భాలలో వారితో చర్చించామని అయన తెలిపారు. నేను మాత్రం ఎప్పుడూ పదవులపై ఆసక్తి చూపలేదు సీఎం అవ్వాలనేది నేను ఎప్పుడూ అనుకోలేదు అని అయన అన్నారు.

ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా విచారణ చేయడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అన్నారు. నోటీసులు ఇవ్వకుండా విచారణ ఎలా చేశారు అని అధికారులను ఈటల ప్రశ్నించారు. దేశ రాజకీయ చరిత్రలో ఇంత దిగజారి కుట్రపూరితంగా ఎవరు వ్యవహరించలేదని ఈటల వ్యాఖ్యానించారు. మనుషులు , పార్టీలు, హోదాలు, అంతస్తులు ఉంటాయి పోతాయి కానీ దర్మం ఎప్పుడూ అంతం కాదు అని అయన అన్నారు.

పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు అలుపు లేకుండా కష్టపడ్డా నాపై ప్రభుత్వం అతి కిరాతకంగా వ్యవహరిస్తోందని ఈటల ఆగ్రహం వ్యక్తంచేశారు. తన పై అక్రమ భూ కబ్జా ఆరోపణలు చేయడమేకాకుండా పలువురు మంత్రులు నోటి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని అది వారి విజ్ఞతకే వదిలేస్తున్న అని అయన అన్నారు. ఇతర పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలగడం నేను చేసిన తప్ప అయితే ఇప్పటి నుండి ప్రతి నాయకులను కలుస్తూ ముందుకు వెళ్తా అని మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.