సినిమా హాల్స్ బంద్..

సినిమా హాల్స్ బంద్..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత ఎక్కువ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలో  సినిమా థియేటర్లు పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా కర్ఫ్యూ రాత్రి పూట ఉండటంతో ఆ ప్రభావం సినిమా హాల్స్ పై ఉంటుందని వారు పేర్కొన్నారు. సాధారణంగా ఉద్యోగులు కుటుంబ సభ్యులు ఎక్కువ శాతం సినిమా చూడడానికి రాత్రి సమయంలోనే వస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 గంటల నుండి కర్ఫ్యూ మొదలవుతుంది ఈ రెండు షోలు నైట్ లో ఉండటం వల్ల ప్రేక్షకులకు ఈ క్రమంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాగా మార్నింగ్, మ్యాట్నీ షోలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సినిమా హాల్స్ ను నడపడం అదనపు భారంగా మారె అవకాశం ఉందని తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు  అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను సడలించే వరకు సినిమా థియేటర్స్ ను పూర్తిగా మూసివేయాలని తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published.