రాష్ట్ర మంత్రి కేటీఆర్ మౌనవ్రతం చేస్తున్నారా? : వైఎస్ షర్మిల

రాష్ట్ర మంత్రి కేటీఆర్ మౌనవ్రతం చేస్తున్నారా? : వైఎస్ షర్మిల

  • నిరుద్యోగులు పిట్టల రాలిపోతున్న ప్రభుత్వానికి కనిపించడం లేదా:షర్మిల
  • ఫామ్ హౌస్ లో నిద్ర మత్తులో నుండి లేవండి: షర్మిల
  • తాలిబన్ల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైతే బందీ అయిందో, కెసిఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయింది:షర్మిల
  • రాజన్న రాజ్యంతోనే తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలు:షర్మిల

ఆర్.బి.ఎం డెస్క్: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు,యువకులు,మేధావులు,మరెంత మంది ప్రజలు కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్నిఒక నిరంకుశ కెసిఆర్ చేతిలో పెట్టి తెలంగాణ ప్రజలు మోసపోయారని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మంచిర్యాల జిల్లాలోని దండేపల్లిలో నిరుద్యోగ నిరాహారదీక్షలో అన్నారు. దీక్షలో షర్మిల మాట్లాడుతూ ఉద్యమకారుడు కదా అని ఉద్యమ స్వప్నాలను, ఆకాంక్షలను నెరవేరుస్తాడని అధికారాన్ని కెసిఆర్ చేతులో పెడితో రాష్ట్రంలో ఉన్న యువకులను,విద్యార్థులను ఉరికంభం ఎక్కిస్తున్నాడు అని షర్మిల కెసిఆర్ పై మండిపడింది.

తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి పోరాటం చేసింది విద్యార్థులు,యువకులు అలంటి వారిని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బలిపీఠం ఎక్కిస్తున్నారని షర్మిల ఆవేదనకు గురైంది. తెలంగాణాలో ఉద్యోగాలు రాక విద్యార్థులు పిట్టల రాలిపోతున్నారని ఇంత జరుగుతున్న కెసిఆర్ మాత్రం దున్నపోతుమీద వర్షం పడ్డట్టు వ్యవహరిస్తున్నారని షర్మిల అన్నారు. ప్రత్యేక్య రాష్ట్రం ఏర్పడితే తెలంగాణాలో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు కానీ ప్రత్యేక్య రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం కెసిఆర్ కుటుంబంలో ఉన్న వారికీ మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని షర్మిల అన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారో ఫామ్ హౌస్ లో మత్తులో నిద్రపోతున్న కెసిఆర్ కు తెలియదు అని షర్మిల అన్నారు. నరేష్ నాయక్ అనే యువకుడికి పెళ్లీడు వచ్చిందని తల్లిదండ్రులు పెళ్లి చేద్దామనుకున్నారు కానీ ఆ యువకుడు తనకు ఉద్యోగమే లేదు నేనే బ్రతకలేను ఇంకా పెళ్లి చేసుకొని భార్యను ఎలా పోషిస్తాను అని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని షర్మిల అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి ఉంటె నరేష్ నాయక్ లాంటి ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే వారా అని షర్మిల కెసిఆర్ ను ప్రశ్నించింది. ఏడేళ్లలో కెసిఆర్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో నాలుగింతలు నిరుద్యోగం పెరిగిందని షర్మిల అన్నారు. అత్యధికంగా నిరుద్యోగులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని షర్మిల అన్నారు. ఉద్యోగం కావాలంటూ 54 లక్షల మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు వీళ్ళే ఇంత మంది ఉంటె దరఖాస్తు చేయనివారు ఇంకా ఎన్ని లక్షల మంది ఉంటారో అని షర్మిల అన్నారు.

కేవలం ఏడు రోజుల వ్యవధిలో ముగ్గురు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని షర్మిల అన్నారు.తెలంగాణలో ఇంకా ఎంత మంది నిరుద్యోగులు ప్రాణాలు అర్పిస్తే కెసిఆర్ మొద్దు నిద్రలో నుండి లేస్తారని షర్మిల మండిపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నారని ఐక్యరాజ్య సమితి ఏంచేస్తుందని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్ అదే తెలంగాణాలో నిరుద్యోగులు పిట్టల రాలిపోతుంటే ఎందుకు ప్రశ్నించండం లేదని మౌనవ్రతం చేస్తున్నారా లేక గుడ్దివ్రతం చేస్తున్నారా అని కేటీఆర్ ను షర్మిల ప్రశ్నించింది.

తాలిబన్ల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైతే బందీ అయిందో అదే విధంగా కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఏడేళ్లుగా తెలంగాణ బందీ అయిందని షర్మిల అన్నారు.తెలంగాణాలో లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేవలం దివంగత నేత రాజశేఖర్ రెడ్డికె దక్కుతుందని షర్మిల అన్నారు. ప్రజల కోసం ఆలోచన చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అని షర్మిల అన్నారు. రైతులకు రుణమాఫీ ఉచిత విద్యుత్ మరెన్నో పథకాలు ఇచ్చిన ఘనత వైఎస్ ఆర్ ది అని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మంచిర్యాల జిల్లాలోని దండేపల్లిలో నిరుద్యోగ నిరాహారదీక్షలో అన్నారు.

Leave a Reply

Your email address will not be published.