వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం అందేలా చర్యలు చేపట్టండి:శ్రీకాంత్ రెడ్డి

వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం అందేలా చర్యలు చేపట్టండి:శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం : అధిక వర్షాలతో నియోజక వర్గంలో దెబ్బతిన్న పంటలకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులును చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత వర్షాల వల్ల నియోజక వర్గ పరిధిలో వరి పంట దెబ్బతినిందన్నారు.అధిక వర్షాలుతో పంట నష్టం జరిగిందన్నారు.

అధిక వర్షాల వల్ల పంటలకు అధికంగా రోగాలు సోకి కూడా పంటలు దెబ్బతిన్నాయన్నారు.వర్షంతో దెబ్బతిన్న పంటలను, రోగాలు తో దెబ్బతిన్న పంటలుపై ప్రతి గ్రామంలోనూ జరిగిన పంటనష్టాలను వ్యవసాయ శాఖ సిబ్బంది,ఏ ఓ లు,డివిజన్ పరిధిలో ఏ డి లు క్షేత్ర పర్యటనలు చేసి పంట నష్టాలను నమోదు చేసి నివేదికలను ఉన్నతాధికారులుకు సమర్పించాలని ఆదేశించారు.ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ తో కూడా మాట్లాడడం జరిగిందన్నారు.

నష్టపోయిన రైతుకు ఇన్ ఫుట్ సబ్సిడీ పంటకు ఇన్సూరెన్స్ అందేలా చర్యలు చేపట్టి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన సూచించారు. అదేరకంగా చెరువులు, కుంటలు, వాగుల దగ్గరికి పిల్లలు, వృద్ధులు వెళ్లకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ఈ వారంలో కార్తీక మాసం రాబోతున్నందున వ్యవసాయ అధికారులును రైతులు సంప్రదించి అదును ప్రకారం పెట్టుకోవాలని ఆయన కోరారు.రైతులకు సంబంధించి ఏ విషయంలోనైనా కూడా పూర్తిగా రైతుకు వెన్నంటి ఉంటామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.