వనస్థలిపురం కోవిడ్ పరీక్షా కేంద్రం వద్ద ఆందోళన.. రాజకీయ నాయకుల అనుచరులకు మాత్రమే….

వనస్థలిపురం కోవిడ్ పరీక్షా కేంద్రం వద్ద ఆందోళన.. రాజకీయ నాయకుల అనుచరులకు మాత్రమే….

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కరోనా మహమ్మారి రోజు రోజుకుకి భారీగా వ్యాప్తిస్తోంది. మానవాళి తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ప్రభుత్వాలు ఇప్పటికే కరోనా నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే తాజాగా నగరంలోని వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ వద్ద ఆందోళన నెలకొంది. కోవిడ్ పరీక్షలు చేయించుకోవడాని వచ్చిన వ్యక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోవిడ్ పరీక్షల నిమిత్తం ఉదయం నుండి క్యూ లో నిలబడ్డ వ్యక్తులను కాదని రాజకీయ నాయకుల అనుచరులకు ముందుగా పరీక్షలు నిర్వహిస్తున్నారని క్యూ లో నిలబడ్డ వ్యక్తులు ఆరోపిస్తున్నారు. కాగా తమకు పరీక్షలు నిర్వహించండి అంటే కిట్స్ అయిపోయాయని మా చేయిపెట్టి కోవిడ్ టెస్ట్ చేయాలా అని అక్కడి సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకోవడాని వచ్చిన వారిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కరోనాను నియంత్రించాలంటే భౌతిక దూరం పాటించాలని ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి కానీ ఈ కోవిడ్ సెంటర్ వద్ద ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా జనాలు గుమ్మిగూడారు. కరోనా లేని వారికీ కూడా ఈ క్రమంలో కరోనా సోకె ప్రమాదం ఉందని అక్కడి స్థానికులు తెలిపారు. ఉదయం నుండి క్యూ లో నిలబడ్డ వారికోసం కనీసం నీటి సదుపాయం, టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. అక్కడి సిబ్బంది మహిళా పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని పరీక్షా చేయించుకోవడని వచ్చిన ఓ మహిళా కన్నీటిపర్యంతం అయింది. తెరాస ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని వారు వ్యాఖ్యానించారు. వనస్థలిపురం కోవిడ్ సెంటర్ వద్ద జరుగుతన్న అన్యాయాలపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు అధిక సంఖ్యలో కరోనా పరీక్షలు చేయించుకుంటున్న క్రమంలో ప్రభుత్వం మరికొన్ని కోవిద్ సెంటర్లను ఏర్పాటు చేయాలనీ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published.