తీన్మార్ ‘కమలన్న’.. మల్లన్న నిర్ణయాన్ని తప్పుబడుతు అయన అభిమానులు ఏమంటున్నారంటే..

teenmarmallanna

తీన్మార్ ‘కమలన్న’.. మల్లన్న నిర్ణయాన్ని తప్పుబడుతు అయన అభిమానులు ఏమంటున్నారంటే..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ‘తీన్మార్ కమలన్న’ అంటూ ఎద్దేవాచేస్తున్నారు. మల్లన్నకు మొదటి నుంచి మద్దతుగా నిలుస్తున్న వారు జహుజనులే. అయితే బహుజనవాదానికి విరుద్ధంగా బీజేపీలో చేరడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకటి రెండు కేసులకు భయపడి బీజేపీలో చేరడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మల్లన్న ఇప్పటివరకు చెబుతున్న మాటలు ఏంటి ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటని మండిపడుతున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో ఓ రాజకీయ వేదికను మల్లన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారని అందరూ అనుకున్నారు. అందరి అంచానాలను తలకిందులు చేసి బీజేపీలో చేరడాన్ని ఆయన శ్రేయోభిలాషులు తట్టుకోలేక పోతున్నారు. ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న కపట నీతిని మల్లన్న ప్రశ్నించారని, ఇప్పటి నుంచి ఆయన కాషాయ కండువా కప్పుకుని జై శ్రీరాం అంటూ రామాయాన్ని పరాయణం చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. మల్లన్న బీజేపీలో చేరనున్నారని ఆయన టీం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన మల్లన్న.. బీజేపీలో చేరుతున్నారని చెబుతున్నారు. రిమాండ్‌లో ఉన్న తన భర్తను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను మల్లన్న సతీమణి మమత మెయిల్‌ ద్వారా అభ్యర్థించారు.

Leave a Reply

Your email address will not be published.