‘ఒరేయ్ బామ్మర్ది’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల..!!

‘ఒరేయ్ బామ్మర్ది’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల..!!

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ లు హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ‘ఒరేయ్ బామ్మర్ది’.. బిచ్చగాడు వంటి మంచి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కాగా కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ లు హీరోయిన్ గా నటించారు . అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రమేష్ పి పిళ్లై నిర్మించారు. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ లు ఒకరి కంటే ఒకరు బాగా నటించారు.. వీరి కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ చిత్రాలు ఈ చిత్రానికి హైలైట్ గా ఉండబోతున్నాయి . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏ.ఎన్ బాలాజీ ఈ నెలలో విడుదల చేయనున్నారు. సిద్ధూ కుమార్ సంగీతం అందించగా ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

నటీనటులు : సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ , కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్

 ఎడిటింగ్ : సాన్ లోకేష్
సినిమాటోగ్రఫీ : ప్రసన్న కుమార్
సంగీతం : సిద్ధూ కుమార్
బ్యానర్ : అభిషేక్ ఫిలిమ్స్
సమర్పణ : రమేష్ పి పిళ్లై
నిర్మాత : రమేష్ పి పిళ్లై
దర్శకుడు : శశి
రిలీజ్ బై : శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ – ఏ.ఎన్ బాలాజీ

Leave a Reply

Your email address will not be published.