విద్యాసంస్థలు బంద్ చేయలేము.. ఆన్లైన్ పాఠాలు కుదరవు..

విద్యాసంస్థలు బంద్ చేయలేము.. ఆన్లైన్ పాఠాలు కుదరవు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరో సరి తన పంజా విసురబోతుంది. పదుల సంఖ్యల కరోనా కేసుల నుండి రోజు రోజుకు వందలలో నమోదవుతున్నాయి. దేశంలోనే అని రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి. కొన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించగా మరికొన్ని రాష్ట్రాలలో కేవలం విద్యాసంస్థలు మాత్రమే మూసేశారు. తాజాగా తెలంగాణలో కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిన్న జరిగిన అసెంబ్లీలో సమావేశంలో మెడికల్ కాలేజీలు మినహా అన్ని విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ప్రటించారు. ఎక్కువ కరోనా కేసులు పాఠశాలలో నమోదుకావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు ఆన్లైన్ తగతులు ఎలా జరిగాయో అదేవిధంగా జరుగుతాయని ఆమె తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రభుత్వం భిన్నమైన చర్యలు తీసుకునేందుకు అడుగులు వేస్తుంది. పక్క రాష్ట్రాల మాదిరిగా ఆన్లైన్ తరగతులు నిర్వహించలేమని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. పాఠశాలలు, కాలేజీలు మూసేసేప్రసక్తే లేదని అయన అన్నారు. ఈ ఆన్లైన్ బోధన వల్ల ముక్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అయన అన్నారు. పాఠశాలలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని అయన అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరు తప్పనిసరిగా మాస్కులు ధరించి కరోనా నిబంధనలను పాటిస్తూ స్కూల్ కి హాజరు కావాలని మంత్రి సూచించారు.

Leave a Reply

Your email address will not be published.