రాజకీయ నాయకులకు పాదయాత్రలు సెంటిమెంట్ గా మారాయ?

రాజకీయ నాయకులకు పాదయాత్రలు సెంటిమెంట్ గా మారాయ?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాజకీయ నాయకులకు పాదయాత్రలు అంత సెంటిమెంట్ గా మారాయ? కేవలం పాదయాత్రలు చేస్తే ప్రజలు వారి వైపు చూస్తారా? రాజకీయ నాయకులకు పాదయాత్రలు ఎన్నికల సమయంలోనే గుర్తొస్తాయా? ఈ పాదయాత్రల వాళ్ళ ఎవరికి లాభం?

ప్రస్తుతం పాదయాత్రలు రాజకీయ కోణంలో చూస్తే సెంటిమెంట్ గానే కనిపిస్తున్నాయి ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో అఖండ విజయం సాధించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పాదయాత్ర సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అయన బాటలోనే అయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసి ప్రతి గడపకు వెళ్లారు. తండ్రి బాటలోనే నడిచిన జగన్ మోహన్ రెడ్డి చివరికి ప్రతిపక్షానికి చెమటలు పాటించే విధంగా ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించారు.

ఈ క్రమంలో పాదయాత్రలు సెంటిమెంట్ గా మారిపోయాయి. ప్రతి రాజకీయ నాయకుడు పాదయాత్రలు చేస్తే ఎన్నికల్లో విజయం సాధించొచ్చు అనే భావనతో ముందడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది .

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయ పార్టీ నాయకులు పాదయాత్రల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంతకు ప్రజలు ఎవరిని నమ్మాలి అధికార పార్టీనా? ప్రతిపక్ష పార్టీనా? ప్రజలపై ఎన్నికల సమయంలో ఉన్న ప్రేమ ఎన్నికల తర్వాత ఎందుకు ఉండడం లేదు. రాజకీయ నాయకులు ఒక్కరిపై ఒక్కరు దుమ్మెత్తుకు పోసుకోవడమే తప్ప ప్రజలకు సేవ చేదాం అనే ఆలోచన ఎవరికి లేన్నట్టు అనిపిస్తోంది.

ప్రజలకు కావాల్సినవి సంక్షేమ పథకాలు కావు..

ప్రతి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయి. ఆ పథకాల ద్వారా ఎవరికి లబ్ది? ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి కష్టపడి చదివిన వారికీ ఆ పథకాలు ఎమ్ పనికొస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను పక్కనబెట్టి ప్రజలకు ఉపాధి ఇవ్వడానికి ప్రయత్నిచాలి. ఇలాంటి పథకాలకు అలవాటు పడిన వ్యక్తి తర్వాత పరిస్థితి ఏంటి కొత్త ప్రభుత్వం కొత్త పథకం అంతేగా. రాజకీయ నాయకుల జీవితాలు మారుతున్నాయి కానీ వారికీ ఓటు వేసి గెలిపించిన వారి జీవితాలు మాత్రం ఎందుకు మారడం లేదు?

Leave a Reply

Your email address will not be published.