వికారాబాద్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య..

వికారాబాద్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య..

ఆర్.బి.ఎం వికారాబాద్: ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ కేంద్రంలో చోటుచేసుకుంది. మృతుడికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు వికారాబాద్ జిల్లా ఎన్నేపల్లి గ్రామానికి చెందిన డేవిడ్(40). డేవిడ్ కానిస్టేబుల్ గా బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడి భార్య పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత నెల రోజులుగా డేవిడ్ విధులకు దూరంగా ఉన్నట్టు సమాచారం. డేవిడ్ ఆత్మహత్యకు గల కారణాలు తదితర విషయాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.