మేకపై ఐదుగురు కామాంధుల గ్యాంగ్ రేప్..

మేకపై ఐదుగురు కామాంధుల గ్యాంగ్ రేప్..

ఆర్.బి.ఎం డెస్క్: అమాయక మహిళలపై లైంగిక దాడులు ప్రతి నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను అమలు చేశాయి. అయినా కూడా ఆ మృగాల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. తాజాగా పాకిస్థాన్ లోని ఒకారాలో మానవ జాతి సిగ్గుతో తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక మేకపై సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. ఐదుగురు కామాంధులు కల్సి మేకను గ్యాంగ్ రేప్ చేసి అనంతరం చిత్ర హింసలకు గురిచేసి దాని చంపేశారు. మేక పై గ్యాంగ్ రేప్ చేస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.స్థానికులు ఆ మృగాలను పట్టుకోవడానికి ప్రయత్నిచడం తో వారు ఘటన స్థలం నుండి పారిపోయారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. సంఘటన స్థలం నుండి తప్పించుకుపోయిన దుండగులను వేటాడి పట్టుకోవడానికి పోలీసులు వేట కొనసాగిస్తూనే ఉన్నారు.ఇప్పుడు ఈ వార్త నెట్టింట  దుమారంరేపుతుంది.

పాకిస్థాన్లో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల వస్త్రధారణ వల్లే లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. బుర్కాలు ధరించకపోవడం వల్లే మహిళలపై లైంగిక దాడులు అధికంగా జరుగుతున్నాయని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అయితే తాజాగా మేకపై జరిగిన లైంగిక దాడికి కారణం బుర్కా ధరించకపోవడమేనా అని సోషల్ మీడియాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రజలు ప్రశ్నల వర్షం కురుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.