లాక్‌డౌన్‌పై వివరణ ఇచ్చిన కెసిఆర్..

లాక్‌డౌన్‌పై వివరణ ఇచ్చిన కెసిఆర్..

హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నడటంతో మళ్ళి లాక్ డౌన్ దిశగా వెళ్తోంది అని సామాజిక మాధ్యమాలలో వార్తలు చెక్కర్లు కొడ్తున్నాయి. అయితే ఇదే విషయం పై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రోజు అసెంబ్లీలో చర్చించారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థల్ని మూసివేశం కానీ పూర్తిగా తెలంగాణాలో లాక్ డౌన్ ఉండదని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పెట్టమని తేల్చిచెప్పారు.

భారీగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో థియేటర్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేయాలంటూ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. విద్యార్థులు కరోనా బారిన పడి ఇబ్బందులకు గురవుతున్న క్రమంలో స్కూళ్లను మూసేశామని పేర్కొన్నారు. స్కూళ్ల మూసివేత తాత్కాలికం మాత్రమే అని కెసిఆర్ అన్నారు. కరోనా మిగితా రాష్ట్రాలతో పోల్చుకుంటే ‌ తెలంగాణలో కరోనా అంత తీవ్రంగా లేదని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published.