ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలి: బి.జనార్దన్ రెడ్డి, బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి

ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలి: బి.జనార్దన్ రెడ్డి, బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనా మహామ్మారిని తరిమికోటేందుకు ప్రతి ఒక్కరు స్వచ్చందంగా ముందుకు వచ్చిన కరోనా వాక్సిన్ తీసుకోవాలని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి కోరారు. ఈరోజు అయన ఆసియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ గాస్ట్రోఎంటరోలాజి కొండాపూర్ గచ్చిబౌలిలో కరోనా టీకా రెండవ డోస్ తీసుకున్నారు.

జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరు స్వచ్చందంగా ముందుకు వచ్చి కరోనా వాక్సిన్ తీసుకుకోవాలని అయన కోరారు. వాక్సిన్ పైన వస్తున్న అపోహలను మానుకోవాలని అయన సూచించారు. ప్రజలంతా సమిష్టిగా పోరాడితేనే ఈ విపత్కర పరిస్థితుల్లో విజయం సాధిస్తామని అయన తెలిపారు. ప్రస్తుతం కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధలను పాటించాలని అయన అన్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ మన ప్రాణాలు మనమే కాపాడుకోవాల్సిన సందర్భం ఇది అని అయన అన్నారు. కొంత మేరకు వాక్సిన్ కొరత ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నాయని అతి తొందర్లోనే ఈ సమస్యను అధిగమిస్తామని వాక్సిన్ కొరత మరోసారి పునరావృతం కాదని ఈ క్రమంలో జనార్దన్ రెడ్డి అన్నారు.కేంద్ర ప్రభుత్వం మే 1 నుండి 18 ఏళ్ళు పైబడిన పౌరులందరికీ   వాక్సిన్ అందించనున్నట్టు ప్రధాన మంత్రి మోడీ ఇప్పటికే ప్రకటించారని అయన మరోసారి గుర్తుచేశారు. ప్రతి ఒక్కరు సామజిక దూరని పాటిస్తూ మాస్కులు ధరించి అత్యవసరం అయితే మినహా బయటికి వెళ్లోద్దని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి ప్రజలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published.