హైదరాబాద్‎లో కుండపోత వర్షం..

హైదరాబాద్: నగరంలో వర్షం దంచికొడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లోని పలు ఏరియాల వారీగా.. మియాపూర్, ఎర్రగడ్డ, బోయిన్ పల్లి, సికింద్రాబాద్, ప్యారడైజ్, ప్యాట్నీ, బేగంపేట్, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, యూసఫ్ గూడ, జూబ్లీ చెక్ పోస్ట్, ఎర్రమంజిల్, కోఠి, ఆబిడ్స్, మసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.