తన స్నేహితుడిని హత్య చేయడానికి కారణం అదే..!

తన స్నేహితుడిని హత్య చేయడానికి కారణం అదే..!

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కారాగారం నుండి విడుదలైన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఓ వ్యక్తి తన మిత్రుడిని అతి కిరాతకంగా హత్య చేసి హతమార్చాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్ సిటీ ప్రాంతంలో శనివారం ఆలస్యంగా బయటపడింది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసుల కథనం ప్రకారం అక్రమంగా మద్యం తరలిస్తున్న రాజా మేత్వాని అనే వ్యక్తిని  నెల కిందట పోలీసులు అరెస్టు చేసారు. అయితే ఈ క్రమంలో తాను పోలీసులకు దొరికి జైలు పాలు కావడానికి తన స్నేహితుడే కారణమని పోలీసులతో చేయి కలిపి డబ్బులకు అమ్ముడుపోయి వారికీ గూఢచారిగా వ్యవరించాడనే అనుమానంతో ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది.అయితే ఈ క్రమంలోనే తన సొంత స్నేహితుడిని అతి కిరాతకంగా హత్య చేసాడు అంటూ పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.