పబ్-జి నా మజాకా….పబ్-జి కోసం 10 లక్షల రూపాయలు ఖర్చు…

పబ్-జి నా మజాకా….పబ్-జి కోసం
10 లక్షల రూపాయలు ఖర్చు…

ప్రతి మనిషి జీవితంలో అభివృద్ధి చెందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. బాగా సంపాదించి మంచి స్థాయిలో ఉండడానికి రోజంతా కష్టపడుతుంటారు.
బతుకు బండిని ముందుకు నడిపేందుకు మనుషులు వారికి నచ్చిన పనుల్లో నిమగ్నమైపోతారు. పాతరోజుల్లో మనుషులు వినోదం కోసం వివిధ ఆటలు ఆడే వాళ్ళు. వినోదం అంటే చాలు ప్రతి మనిషిలోనూ బాల్యం బయటికి వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకూ ఎన్నో రకాల ఆటలు ఆడేవాళ్లు. కానీ ప్రస్తుత కాలంలో కాలక్షేపం వినోదం అంటే చాలు అందరికీ స్మార్ట్ఫోన్ గుర్తొస్తుంది. ఈ కాలం పిల్లలు పెద్దలు అందరూ ఫోన్ లో గేమ్ లకు బానిసలవుతున్నారు.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఆట పబ్-జి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ ఆటని బాగా ఇష్టపడుతున్నారు. పిల్లలు అయితే ఇక చెప్పనవసరం లేదు పూర్తిగా ఆటలో మునిగిపోతున్నారు, వారి చుట్టూ జరిగే విషయాలు కూడా వారికి తెలియడం లేదు. పబ్-జి గురించి ప్రతి రోజు ఒక కొత్త వార్త వినిపిస్తోంది. అయితే తాజాగా ముంబైలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఒక పదహారేళ్ల పిల్లవాడు పబ్-జి ఆట కోసం తన తల్లిదండ్రులకు తెలియకుండా తన తల్లి బ్యాంక్ అకౌంట్ నుండి 10 లక్షల రూపాయలను ఖర్చు చేశాడంట. పిల్లవాడు ఆట కోసం డబ్బులను వర్చువల్ కరెన్సీ గా మార్చి ఖర్చు చేశాడంట. ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కుమారుడిని మందలించడంతో ఆ పిల్లవాడు ఒక లేఖ రాసి ఇంటి నుండి పారిపోయాడు. పోలీసులు పిల్లవాణ్ణి వెతికి పట్టుకొని తమ తల్లిదండ్రులకు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published.