ప్రతి విద్యార్థి సృజనాత్మకత, ఆలోచనా విధానాలను పెంపొందించుకుని శాస్త్రవేత్తలుగా ఎదగాలి: మోoడ్ర సంగీత గౌరీశంకర్, అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్

ప్రతి విద్యార్థి సృజనాత్మకత, ఆలోచనా విధానాలను పెంపొందించుకుని శాస్త్రవేత్తలుగా ఎదగాలి: మోoడ్ర సంగీత గౌరీశంకర్, అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అత్తాపూర్ డివిజన్ హైదర్ గూడ లోని శ్రీ చైతన్య పాఠశాలల్లో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనల్లో అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ మోoడ్ర సంగీత గౌరీశంకర్ పాల్గొన్నారు.

ఆర్.బి.ఎం అత్తాపూర్: సైన్స్ తోనే ప్రపంచం పురోభివృద్ధి చెందుతోందని అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ మోoడ్ర సంగీత గౌరీశంకర్ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అత్తాపూర్ డివిజన్ హైదర్ గూడ లోని శ్రీ చైతన్య పాఠశాలల్లో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో ముఖ్య అతిథిగా మోoడ్ర సంగీత గౌరీశంకర్ పాల్గొన్నారు.

విద్యార్థులు ప్రదర్శించిన ప్రతి వైజ్ఞానిక నమూనాలును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మోoడ్ర సంగీత గౌరీశంకర్ మాట్లాడుతూ సర్ సివి రామన్ ఒక కాంతి పుంజం అణువుల వల్ల మార్గం మల్లితే,తరంగ దైర్ఘ్యంలో మార్పు వస్తుందన్న ఆవిష్కకరణ అయిన రామన్ ఎఫెక్ట్ కు నోబెల్ బహుమతి వచ్చిందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా భారత దేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన దానికి గుర్తుగా మన దేశంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 28 న జాతీయ సైన్స్ దినోత్సవంగా పాటిస్తున్నామన్నారు. భౌతిక శాస్త్రంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసిన మహోన్నత వ్యక్తి సర్ సివి రామన్ అని ఆమె అన్నారు.

దేశంలో ముఖ్యమైన సమస్యల పరిష్కారంలోనూ, ఇతర దేశాలతో మన దేశాన్ని సమవుజ్జీగా నిలపడంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రనాయకత్వ స్థితికి చేర్చడంలోనూ ఎన్నోన్నో సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర , శాస్త్రజ్ఞులపాత్ర విలువకట్టలేనిదన్నారు. చదువులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి సమాజంలో విజ్ఞాన వెలుగులు పంచాలన్నారు.

జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే చదువు ఒక్కటే మార్గమని, చదువుతో పాటు క్రమశిక్షణ, తల్లిదండ్రులు,పెద్దలు, ఉపాధ్యాయులుపై గౌరవం పెంచుకోవాలని, సామాజిక పోకడలపై పరిజ్ఞానం పెంపొందించుకుని రాణించాలన్నారు.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లుగా కలలు కనండి ఆ కలల సాకారనికి కృషిచేయాలని ఆమె సూచించారు. శాస్త్రవేత్తల స్పూర్తితో ప్రతి విద్యార్థి సృజనాత్మకత, ఆలోచనా విధానాలను పెంపొందించుకుని శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలును మోoడ్ర సంగీత గౌరీశంకర్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అత్తాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రావుల జగన్,సులిగే సంతోష్, శ్రీ చైతన్య పాఠశాల ఇంచార్జ్ శ్రీకాంత్, నాయకులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.