ఏపీలో కరోనా కేసులు కొత్తగా ఎన్నో తెలుసా?

ఏపీలో కరోనా కేసులు కొత్తగా ఎన్నో తెలుసా?

ఆర్.బి.ఎం డెస్క్ అమరావతి: రోజు రోజుకు కరోనా తన వికృత రూపాని ప్రదర్శిస్తోంది తాజాగా ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు భారీ నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 61 లక్షల వరకు తాజాగా 24 గంటల్లో 56,145 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 4,256 మందికి
కరోనా పాజిటివ్‌గా నమోదైంది. అయితే ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 7,23,512కు చేరింది. కరోనాకు ఇప్పటి వరుకు 6,019 మంది బలైయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 51,060 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కరోనా బారీనపడి ఒక్క ఆదివారం నాడే 7,558 మంది కోలుకోగా మొత్తం 6,66,433 మంది కోలుకున్నారని వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published.